

వ్యక్తిగత లేదా వ్యాపార రుణం పొందడం ఇప్పుడు మరింత సులభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన అకౌంట్ అగ్రిగేటర్ (AA) వ్యవస్థతో వారాల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లోనే రుణ దరఖాస్తులను పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరణ తెలియజేస్తున్నారు.
అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఆర్థిక వివరాలను సురక్షితంగా నేరుగా రుణ సంస్థలకు అందించగలుగుతున్నారు. దీంతో కాగితాల పని తగ్గడమే కాకుండా నకిలీ పత్రాల ద్వారా జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతోంది. ఏఐ వ్యవస్థలు కేవలం సీబిల్ స్కోర్ మాత్రమే కాకుండా యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు, నగదు ప్రవాహాన్ని విశ్లేషించి రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయి.
చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రిటర్న్స్, వ్యాపార లావాదేవీల ఆధారంగా పూచీకత్తు లేకుండానే రుణాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీడియో కేవైసీ, డిజిటల్ సంతకాలతో ఇంటి నుంచే మొత్తం ప్రక్రియ పూర్తవుతోంది. వినియోగదారుల అనుమతి లేకుండా డేటా వినియోగించకుండా ఆర్బీఐ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!