

భారతీ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం రూ.185, రూ.203, రూ.206 ధరలతో మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ డేటా అవసరం లేకుండా వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవలను మాత్రమే కోరుకునే వారికి ఇవి ఉపయోగపడనున్నాయి. రూ.185 ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్తో పాటు 300 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. రూ.203 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో ఇదే కాలింగ్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలను అందిస్తుంది. రూ.206 ప్లాన్లో క్యాలెండర్ నెల ప్రాతిపదికన వ్యాలిడిటీ ఉంటుంది.
ఈ మూడు ప్లాన్లలో మొబైల్ డేటా ప్రయోజనాలు లేవు. అయితే, ఉచిత హలోట్యూన్స్ సదుపాయం అందిస్తున్నట్లు సమాచారం. ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, సీనియర్ సిటిజన్లు, సెకండరీ సిమ్ వినియోగదారులు, ఇంటర్నెట్ కోసం వై-ఫైపై ఆధారపడేవారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. వినియోగదారులు తమ అవసరాలకు సరిపోయే వ్యాలిడిటీని ఎంచుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ల లభ్యత, పూర్తి నిబంధనలను ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో పరిశీలించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!