23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోల్డ్ లోన్ తీసుకున్నవారికి అలర్ట్...కొత్త రుణాలపై ఆంక్షలు!

Writer: Pooja 05:40 AM, 23 అక్టోబర్, 2026
గోల్డ్ లోన్ తీసుకున్నవారికి అలర్ట్...కొత్త రుణాలపై ఆంక్షలు!

భారత్‌లో గోల్డ్ లోన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. బంగారాన్ని హామీగా తీసుకుని ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకోవడంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం రుణ చెల్లింపుల వైఫల్యాలు ఆందోళనకర స్థాయికి చేరకపోయినప్పటికీ, భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలపై ఆర్థిక సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. బకాయిలు చెల్లించని ఖాతాదారులకు కొత్తగా గోల్డ్ లోన్లు ఇవ్వడాన్ని పిరామల్ ఫైనాన్స్ నిలిపివేసినట్లు సమాచారం. మరోవైపు, స్వల్పకాలిక గోల్డ్ లోన్లను నిలిపివేయనున్నట్లు బజాజ్ ఫైనాన్స్ ప్రకటించింది.

గత ఏడాది బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పెద్ద ఎత్తున గోల్డ్ లోన్లు మంజూరు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి బ్యాంకులు రూ.5.6 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను జారీ చేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 83 శాతం అధికం. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా రూ.3.6 లక్షల కోట్ల రుణాలను అందించాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 69 శాతం పెరుగుదల. అయితే, ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయులతో పోలిస్తే విలువైన లోహాల ధరలు 50 శాతం వరకు పడిపోయినట్లు కథనం పేర్కొంది. దీంతో రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు పెరుగుతున్నాయి. గడువు ముగిసిన 90 రోజుల తర్వాత కూడా తమ గోల్డ్ లోన్లలో 15 నుంచి 23 శాతం వరకు బకాయిలు వసూలు కాలేదని పిరామల్ ఫైనాన్స్ వెల్లడించినట్లు సమాచారం.

గోల్డ్ లోన్ మార్కెట్‌లో ప్రమాదాలను తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గత ఏడాది జూన్‌లో మార్గదర్శకాలను ప్రకటించింది. వాటి ప్రకారం, రూ.2.5 లక్షల వరకు రుణాలకు బంగారం విలువలో గరిష్ఠంగా 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలకు 80 శాతం, రూ.5 లక్షలకు మించిన రుణాలకు 75 శాతం వరకు మాత్రమే రుణం ఇవ్వాలి. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గోల్డ్ లోన్ల జారీ వేగం కొంత తగ్గింది. అయినప్పటికీ, ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. 2028 మార్చి నాటికి దేశంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ల మొత్తం రూ.30 లక్షల కోట్లకు చేరవచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

అప్పుల నుంచి బయటపడేందుకు జియో కొత్త వ్యూహం...ఐపీఓపై అందరి చూపు!

అప్పుల నుంచి బయటపడేందుకు జియో కొత్త వ్యూహం...ఐపీఓపై అందరి చూపు!

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్...కొత్త ఛార్జీలు అమల్లోకి

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్...కొత్త ఛార్జీలు అమల్లోకి

వీజెన్ బయో కార్-టీ చికిత్సకు న్యుసెలియాన్ సాంకేతిక సహకారం

వీజెన్ బయో కార్-టీ చికిత్సకు న్యుసెలియాన్ సాంకేతిక సహకారం

ట్యాగ్లు
బంగారు రుణాలుగోల్డ్ లోన్ మార్కెట్రుణ బకాయిలుఆర్‌బీఐ నిబంధనలుఎన్‌బీఎఫ్‌సీలుబంగారం ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి
జనరల్

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన
జనరల్

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన
జనరల్

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు
జనరల్

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి - అధికారులకు పీసీబీ ఆదేశాలు
జనరల్

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి - అధికారులకు పీసీబీ ఆదేశాలు

పట్టణాభివృద్ధిపై తెలంగాణ కీలక నిర్ణయాలు
జనరల్

పట్టణాభివృద్ధిపై తెలంగాణ కీలక నిర్ణయాలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ నివేదిక
జనరల్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ నివేదిక

బ్రహ్మోత్సవాల్లో వర్షపు ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు
జనరల్

బ్రహ్మోత్సవాల్లో వర్షపు ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు

గోల్డ్ లోన్ తీసుకున్నవారికి అలర్ట్...కొత్త రుణాలపై ఆంక్షలు!
బిజినెస్

గోల్డ్ లోన్ తీసుకున్నవారికి అలర్ట్...కొత్త రుణాలపై ఆంక్షలు!

టికెట్ ధరల పెంపుపై నిర్మాత ధీరజ్ మొగిలినేని కీలక వ్యాఖ్యలు
సినిమాలు

టికెట్ ధరల పెంపుపై నిర్మాత ధీరజ్ మొగిలినేని కీలక వ్యాఖ్యలు

కార్తీక మాసం 2026: పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు శుభ ముహూర్తాలు అనుకూల తేదీలివే!
జనరల్

కార్తీక మాసం 2026: పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు శుభ ముహూర్తాలు అనుకూల తేదీలివే!

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ ఘడియల వివరాలు!
జనరల్

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ ఘడియల వివరాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!