13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ రాజీనామా?

Writer: Pooja 09:18 AM, 13 ఆగస్టు, 2026
టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ రాజీనామా?

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 ఫిబ్రవరి 20తో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని 63 ఏళ్ల చంద్రశేఖరన్‌ ప్రకటించారు. ఆయనకు మూడోసారి పదవీకాలం పొడిగించే విషయంలో టాటా సన్స్‌ బోర్డు, టాటా ట్రస్టుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నోయల్‌ టాటా మద్దతు ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

1987లో టీసీఎస్‌లో ట్రైనీ ప్రోగ్రామర్‌గా చేరిన చంద్రశేఖరన్‌. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌కు సేవలందిస్తున్నారు. 2009లో టీసీఎస్‌ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2017 జనవరిలో టాటా గ్రూప్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్‌కు చెందిన 26 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. గ్రూప్‌ ఆదాయం, నికర లాభం కూడా భారీగా వృద్ధి చెందాయి. 157 ఏళ్ల టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి పార్శీయేతర వ్యక్తిగా చంద్రశేఖరన్‌ గుర్తింపు పొందారు.

కొత్త వ్యాపారాల పనితీరు, భవిష్యత్‌ పెట్టుబడులు, టాటా సన్స్‌ లిస్టింగ్‌ వంటి అంశాలపై టాటా ట్రస్టులు, టాటా సన్స్‌ బోర్డు మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది. తన పునర్నియామకంపై ఆరు నెలలుగా నిర్ణయం వెలువడకపోవడంతో చంద్రశేఖరన్‌ స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నాయకత్వ మార్పు సజావుగా జరిగేందుకు త్వరగా కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయాలని ఆయన బోర్డును కోరారు. చంద్రశేఖరన్‌కు 2022లో పద్మభూషణ్‌, 2023లో ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం, 2024లో బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి గౌరవ KBE పురస్కారం లభించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
టాటా గ్రూప్టాటా సన్స్చంద్రశేఖరన్నోయల్ టాటాకార్పొరేట్ వార్తలుబిజినెస్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన
ఓటీటీ

‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ రిలీజ్.. అధికారిక ప్రకటన

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు
టెక్నాలజీ

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్
టెక్నాలజీ

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే
జనరల్

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)
జనరల్

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట
బిజినెస్

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లేహ్‌లో భూకంపం..
జనరల్

లేహ్‌లో భూకంపం..

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు
బిజినెస్

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!