10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

Writer: Pooja 11:07 AM, 10 సెప్టెంబర్, 2026
కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌పై అమెరికా కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. వలస కార్యక్రమాల్లో మోసపూరిత విధానాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో, సంస్థ దాఖలు చేసే కొత్త పర్మనెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ దరఖాస్తులను నిలిపివేసింది. ఉద్యోగి ఆధారిత గ్రీన్‌కార్డు ప్రక్రియలో పర్మనెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ కీలకమైన తొలి దశ. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంథొనీ డి ఎస్పోసిటో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికన్‌ కార్మికులకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని, వైట్‌హౌస్‌ ఫ్రాడ్‌ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

విజిల్‌బ్లోయర్ల నుంచి అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్య చేపట్టినట్టు ఎస్పోసిటో తెలిపారు. అయితే ఆరోపణల పూర్తి వివరాలను, ప్రభావితమైన దరఖాస్తుల సంఖ్యను కార్మిక శాఖ వెల్లడించలేదు. ఇప్పటికే ఆమోదం పొందిన సర్టిఫికేషన్లపై ఈ నిలిపివేత ప్రభావం ఉండదని, హెచ్‌-1బీ వీసా కార్యక్రమానికి ఇది వర్తించదని స్పష్టం చేశారు. కాగ్నిజెంట్‌తో పాటు క్లౌడెరా అనే మరో టెక్‌ కంపెనీపై కూడా సమాంతరంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ చర్యకు ఒక్కరోజు ముందే కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ 1,500 మంది అమెరికన్‌ కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని, తమ వర్క్‌ఫోర్స్‌ను 15,000కు విస్తరిస్తామని ప్రకటించారు. యూఎస్‌సీఐఎస్‌ గణాంకాల ప్రకారం, కాగ్నిజెంట్‌ హెచ్‌-1బీ పిటిషన్ల ఆమోదాలు 2020లో 9,413 నుంచి 2026లో 3,510కి తగ్గాయి. కొత్త దరఖాస్తులను నిరోధించే అధికారం కార్మిక శాఖకు ఉందా అనే అంశంపై స్పష్టత లేదని ఇమిగ్రేషన్‌ న్యాయవాది పూర్వి చోతానీ పేర్కొన్నారు. కాగ్నిజెంట్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం భారత ఐటీ నిపుణుల దీర్ఘకాలిక ప్రాజెక్టుల డెలివరీ విధానాలను ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాగ్నిజెంట్‌, నాస్కామ్‌ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ట్యాగ్లు
కాగ్నిజెంట్అమెరికా కార్మిక శాఖపర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్హెచ్ వన్ బీ వీసాభారత ఐటీ నిపుణులువలస విధానాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌
బిజినెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర
బిజినెస్

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన
జనరల్

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?
జనరల్

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!