

పండగ సీజన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థల విక్రయాలు ఊపందుకున్నాయి. పండగ సేల్ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, అజియో తదితర ఆన్‌లైన్ వేదికల ద్వారా సుమారు రూ.24,000 కోట్ల విలువైన ఉత్పత్తులు అమ్ముడైనట్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా వేసింది. ఈ రెండు రోజుల్లో సాధారణ రోజువారీ వ్యాపారంతో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
ఈ సమయంలో సుమారు 6–6.5 కోట్ల మంది వినియోగదారులు దాదాపు 8–9 కోట్ల ఆర్డర్లు చేసినట్లు రెడ్‌సీర్ అంచనా వేసింది. మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్ల వాటా 30–40 శాతంగా ఉండగా, వాటి విలువ రూ.9,100–9,600 కోట్లుగా నమోదైంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వాటా 25–27 శాతంగా, వాటి విలువ రూ.6,000–6,500 కోట్లుగా ఉంది. ఫ్యాషన్ ఉత్పత్తులు మొత్తం అమ్మకాల్లో 15–18 శాతం వాటాను కలిగి ఉండగా, వాటి విలువ రూ.3,630–4,350 కోట్లుగా రెడ్‌సీర్ అంచనా వేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!