
జనరల్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికం (క్యూ1)లో హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 18 శాతం పెరిగి రూ.1,344.50 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1,142 కోట్లుగా నమోదైంది. అయితే కంపెనీ నికర లాభం రూ.24.97 కోట్లకు పరిమితమై, గత ఏడాది నమోదైన రూ.40.54 కోట్లతో పోలిస్తే 38.4 శాతం తగ్గింది.
కంపెనీ ఖర్చులు 21 శాతం పెరిగి రూ.1,310.9 కోట్లకు చేరుకోవడంతో లాభాలపై ప్రభావం పడింది. పాల ధరల పెరుగుదల, పాల కొరత పరిశ్రమను ప్రభావితం చేశాయని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. అయినప్పటికీ పాల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం, మార్కెట్ వాటాను పెంచుకోవడం, విలువ ఆధారిత ఉత్పత్తుల్లో వృద్ధి సాధించడం ద్వారా కంపెనీ సవాళ్లను అధిగమించిందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!