

భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఒకేసారి 10 కొత్త టూవీలర్లను ప్రకటించింది. ఇందులో 7 పూర్తిగా కొత్త మోడళ్లు, 3 అప్‌డేటెడ్ వెర్షన్లు ఉన్నాయి. అడ్వెంచర్ స్కూటర్లు, రెట్రో రోడ్‌స్టర్లు, క్రూయిజర్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలతో దాదాపు అన్ని ప్రధాన సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుంది. ప్రతి మోడల్‌ను దశలవారీగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ జాబితాలో ADV 160 అడ్వెంచర్ స్కూటర్, రెట్రో స్టైల్ CB500, Rebel 300, Rebel 500 క్రూయిజర్ బైక్స్, అలాగే XR300L డ్యూయల్ పర్పస్ మోటార్‌సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రీమియం రైడింగ్ అనుభవంతో పాటు పర్యావరణహిత సాంకేతికతను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త మోడళ్లను రూపొందించినట్లు హోండా తెలిపింది. ప్రతి మోడల్‌కు సంబంధించిన ధరలు, విడుదల తేదీలను ఆయా లాంచ్‌ల సమయంలో ప్రకటించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!