
సినిమాలు

జూన్ 2026 నెలకు సంబంధించి హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. జీఎస్టీ సంస్కరణల తర్వాత కార్ల మార్కెట్లో పోటీ పెరగడంతో విక్రయాలను మరింత పెంచుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్లు డిస్కౌంట్లతో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌లు, ఫైనాన్స్ సంబంధిత ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంది.
ఈ ఆఫర్లలో అత్యధికంగా హ్యుందాయ్ క్రెటాపై రూ.1.05 లక్షల వరకు ప్రయోజనం లభించనుంది. గ్రాండ్ i10 నియోస్‌పై రూ.80 వేల వరకు, i20పై రూ.65 వేల వరకు, వెర్నాపై రూ.55 వేల వరకు, ఎక్స్టర్‌పై రూ.40 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదనంగా అప్‌గ్రేడ్ బోనస్‌లు, ప్రాసెసింగ్ ఫీ మాఫీలు, ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్స్‌ను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!