
సినిమాలు

2026-27 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.95 శాతం పెరిగి రూ.14,804 కోట్లకు చేరగా, ఏకీకృత నికర లాభం 13.88 శాతం వృద్ధితో రూ.15,440 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 12.7 శాతం పెరిగి రూ.24,384 కోట్లకు చేరడం విశేషం.
త్రైమాసికంలో రుణాల పంపిణీ దాదాపు 20 శాతం, డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. ట్రెజరీ ఆదాయం మినహా ఇతర ఆదాయం 16 శాతం పెరిగి రూ.8,425 కోట్లకు చేరగా, ట్రెజరీ ఆదాయం రూ.151 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.67 శాతం నుంచి 1.38 శాతానికి తగ్గి ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. కేటాయింపులు తగ్గగా, జూన్ 30, 2026 నాటికి బ్యాంక్ మూలధన సమృద్ధి నిష్పత్తి 16.84 శాతంగా నమోదైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!