4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో వృద్ధి

Writer: Venkatesh 07:03 AM, 19 ఏప్రిల్, 2026
ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో వృద్ధి

ఐసీఐసీఐ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి–మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో ఏకీకృత నికర లాభం రూ.14,755 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,502 కోట్లతో పోలిస్తే ఇది 9.28% వృద్ధి. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.12,630 కోట్ల నుంచి 8.5% పెరిగి రూ.13,702 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం నికర లాభం రూ.50,147 కోట్లుగా నమోదై, గత సంవత్సరం రూ.47,227 కోట్లతో పోలిస్తే 6.2% పెరిగింది.

సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (NII) 8.4% పెరిగి రూ.22,979 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 4.32%గా నమోదైంది. వడ్డీేతర ఆదాయం (ట్రెజరీ మినహా) 5.6% పెరిగి రూ.7,415 కోట్లకు చేరింది. అయితే ట్రెజరీ విభాగంలో రూ.106 కోట్ల నష్టం నమోదైంది. నిర్వహణ వ్యయాలు 12% పెరిగి రూ.12,089 కోట్లకు చేరాయి. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించింది. స్థూల ఎన్‌పీఏలు 1.53% నుంచి 1.4%కు తగ్గాయి. గత త్రైమాసికంలో ఇవి 1.67%గా ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.4,242 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గి రూ.891 కోట్ల నుంచి రూ.96.16 కోట్లకు చేరాయి.

దేశీయ కార్పొరేట్ రుణాలు 9%కు పైగా పెరిగినప్పటికీ, మొత్తం రుణాల్లో వాటా 20%కు పరిమితమైంది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్ మూలధన సమృద్ధి నిష్పత్తి 17.18%గా ఉంది. ప్రధాన బఫర్ 16.35%గా నమోదైంది. ఒక్కో షేర్‌కు రూ.12 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బత్రా వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

ట్యాగ్లు
ఐసీఐసీఐ బ్యాంక్బ్యాంక్ లాభాలుక్యూ4 ఫలితాలుఎన్‌పీఏలుడివిడెండ్ఆర్థిక ఫలితాలుభారత బ్యాంకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను
సినిమాలు

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌
బిజినెస్

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక
జనరల్

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ
రాజకీయాలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
టెక్నాలజీ

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!