Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

2025 నాటికి దేశంలో 95 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు!

06:30 AM, 30 జనవరి, 2026
2025 నాటికి దేశంలో 95 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు!

2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లను దాటిందని ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (IAMAI) – కాంటార్ సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025’ వెల్లడించింది. 2024తో పోలిస్తే వినియోగదారుల సంఖ్యలో 8 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ, షార్ట్ వీడియోలకు పెరిగిన ఆదరణ, ఏఐ వినియోగం విస్తరించడం ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా 95.8 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, అందులో దాదాపు 54.8 కోట్లు గ్రామీణ భారత్‌కు చెందినవారు. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ యూజర్ల వృద్ధి నాలుగు రెట్లు వేగంగా సాగుతోంది. దేశంలో 58.8 కోట్ల మంది షార్ట్ వీడియోలు వీక్షించగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య కొద్దిగా అధికంగా ఉంది. మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మంది వాయిస్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్, ఏఐ ఫిల్టర్లు, చాట్‌బాట్‌లు వంటి కృత్రిమ మేధ ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. ఇక ఇప్పటికీ దాదాపు 57.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ను యాక్టివ్‌గా వినియోగించడం లేదని, అయితే ఈ సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతోందని నివేదిక స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించిన టీ-మొబైల్

హైదరాబాద్‌లో గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించిన టీ-మొబైల్

కొనుగోలుదారులకు ఊరట...మళ్లీ దిగివచ్చిన బంగారం ధరలు

కొనుగోలుదారులకు ఊరట...మళ్లీ దిగివచ్చిన బంగారం ధరలు

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

దేశంలో రెండో స్థానానికి హైదరాబాద్ ఎదుగుదల

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

నెలకు రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ కొత్త ఐడియా

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

ట్యాగ్లు
భారత్ ఇంటర్నెట్ వినియోగదారులుఐఏఎంఏఐ నివేదిక 2025డిజిటల్ ఇండియాగ్రామీణ ఇంటర్నెట్ వృద్ధిషార్ట్ వీడియో ట్రెండ్ఏఐ వినియోగంఆన్‌లైన్ షాపింగ్ఇంటర్నెట్ గణాంకాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!