23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!

Writer: Chandrika 07:09 PM, 23 అక్టోబర్, 2026
పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!

స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరగడంతో భారత మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఫోన్ల కొనుగోలు ఖర్చు పెరగడంతో వినియోగదారులు కొత్త ఫోన్లు కొనడాన్ని, పాత ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేసుకోవడాన్ని వాయిదా వేస్తున్నారు. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం.. 2026 మూడో త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 20 శాతం క్షీణించింది. ఇది గత దశాబ్ద కాలంలో నమోదైన అత్యల్ప స్థాయిగా పేర్కొంది. 2026 ఏడాది మొత్తంగా ఈ మార్కెట్‌ సుమారు 13 శాతం తగ్గవచ్చని రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ అంచనా వేశారు. విడిభాగాల ధరలు పెరగడం, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడి పెరగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

మార్కెట్‌లో అమ్మకాలు తగ్గినప్పటికీ, శాంసంగ్‌ 17 శాతం వాటాతో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గెలాక్సీ ఏ సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విక్రయ వ్యూహాలు సంస్థకు ప్రయోజనం చేకూర్చాయి. మరోవైపు, వివో మార్కెట్‌ వాటా 20 శాతం నుంచి 16 శాతానికి, ఒప్పో వాటా 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గాయి. షావోమీ 8 శాతం వాటాను కొనసాగించగా, యాపిల్‌ వాటా 9 శాతం నుంచి 8 శాతానికి పడిపోయింది. దేశీయ బ్రాండ్లలో ఏఐ+ అత్యంత వేగంగా వృద్ధి చెంది, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 306 శాతం వృద్ధిని నమోదు చేసింది. విడిభాగాల ఖర్చులు పెరగడం వల్ల ముఖ్యంగా రూ.15,000లోపు ఫోన్ల విక్రయాలు బలహీనపడ్డాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు శుభమ్‌ సింగ్‌ తెలిపారు. రూ.20,000లోపు ఫోన్ల విభాగంలోనూ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించిందని నివేదిక పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యతరగతికి పన్ను ఊరట.. మోదీ సర్కారు కీలక నిర్ణయం

మధ్యతరగతికి పన్ను ఊరట.. మోదీ సర్కారు కీలక నిర్ణయం

వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక ఘట్టం..రైల్వే నెట్‌వర్క్‌తో రోఘాట్ అనుసంధానం

భారతీయ రైల్వేలో చారిత్రాత్మక ఘట్టం..రైల్వే నెట్‌వర్క్‌తో రోఘాట్ అనుసంధానం

చైనా వెళ్లాలనుకుంటున్నారా? కొత్త వీసా విధానంపై ఓ లుక్కేయండి!

చైనా వెళ్లాలనుకుంటున్నారా? కొత్త వీసా విధానంపై ఓ లుక్కేయండి!

భారత్‌లో అల్ట్రావయొలెట్ X-47 వెనం లాంచ్

భారత్‌లో అల్ట్రావయొలెట్ X-47 వెనం లాంచ్

కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్? వాట్సాప్ యూజర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..

కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్? వాట్సాప్ యూజర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ట్యాగ్లు
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌స్మార్ట్‌ఫోన్‌ ధరలుశాంసంగ్‌కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌వివోఒప్పోషావోమీయాపిల్‌ఏఐ ప్లస్‌బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క కాంబో యాడ్‌కు రూ.30 లక్షలా? యూట్యూబర్‌ సౌరవ్‌ జోషి సంపాదనపై చర్చ!
జనరల్

ఒక్క కాంబో యాడ్‌కు రూ.30 లక్షలా? యూట్యూబర్‌ సౌరవ్‌ జోషి సంపాదనపై చర్చ!

తెలంగాణలో కరువుపై సర్కార్‌ అలర్ట్‌.. జిల్లాలవారీగా కార్యాచరణ!
జనరల్

తెలంగాణలో కరువుపై సర్కార్‌ అలర్ట్‌.. జిల్లాలవారీగా కార్యాచరణ!

‘రాధేశ్యామ్‌’పై ప్రశాంత్‌ నీల్‌ పంచ్‌.. ‘సలార్‌ 2’లో చెబుతా అంటూ ప్రభాస్‌ స్వీట్‌ వార్నింగ్‌!
సినిమాలు

‘రాధేశ్యామ్‌’పై ప్రశాంత్‌ నీల్‌ పంచ్‌.. ‘సలార్‌ 2’లో చెబుతా అంటూ ప్రభాస్‌ స్వీట్‌ వార్నింగ్‌!

హమాలీ, డొమెస్టిక్‌ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు: మంత్రి వివేక్‌ వెంకటస్వామి
జనరల్

హమాలీ, డొమెస్టిక్‌ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు: మంత్రి వివేక్‌ వెంకటస్వామి

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!
బిజినెస్

పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. దశాబ్ద కనిష్ఠానికి భారత మార్కెట్‌!

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి సినిమా ప్రారంభం.. దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం
సినిమాలు

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి సినిమా ప్రారంభం.. దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి
జనరల్

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం
జనరల్

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

భారీ సైబర్‌ భద్రతా లోపం.. గ్లోబల్ SSL/TLS సర్టిఫికెట్ వ్యాపారాన్ని నిలిపివేయనున్న eMudhra
టెక్నాలజీ

భారీ సైబర్‌ భద్రతా లోపం.. గ్లోబల్ SSL/TLS సర్టిఫికెట్ వ్యాపారాన్ని నిలిపివేయనున్న eMudhra

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు
జనరల్

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు

సంక్లిష్ట వ్యాధుల నిర్ధారణలో వైద్యుల కంటే రెండింతలకుపైగా కచ్చితత్వం.. మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యవస్థ
టెక్నాలజీ

సంక్లిష్ట వ్యాధుల నిర్ధారణలో వైద్యుల కంటే రెండింతలకుపైగా కచ్చితత్వం.. మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యవస్థ

‘జైలర్ 2’పై బన్నీ ప్రశంసలు.. మళ్లీ మొదలైన మెగా, అల్లు ఫ్యాన్స్ వార్
సినిమాలు

‘జైలర్ 2’పై బన్నీ ప్రశంసలు.. మళ్లీ మొదలైన మెగా, అల్లు ఫ్యాన్స్ వార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!