

స్ట్రీమింగ్ సేవల దిగ్గజం జియోహాట్‌స్టార్ తన అంతర్జాతీయ విస్తరణలో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, సింగపూర్ మార్కెట్లలో సేవలను ప్రారంభించింది. ఈ మూడు దేశాల్లో జియోహాట్‌స్టార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. జియోస్టార్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ అమిత్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లో 12కు పైగా భాషల్లో 1.60 లక్షల గంటలకు పైగా కంటెంట్ అందుబాటులో ఉంది. ప్రతి ఏడాది సుమారు 30,000 గంటల తాజా కంటెంట్‌ను జోడిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
ఈ మూడు అంతర్జాతీయ మార్కెట్లలో తొలిసారిగా త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టినట్లు జియోహాట్‌స్టార్ తెలిపింది. సెప్టెంబర్ 2 నుంచి యూకేలో క్వార్టర్లీ ప్లాన్ ధర 19.99 పౌండ్లు, కెనడాలో 19.99 కెనడియన్ డాలర్లు, సింగపూర్‌లో 29.98 సింగపూర్ డాలర్లుగా ఉండనున్నాయి. విభిన్న భాషల్లో విస్తృతమైన కంటెంట్‌తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సంస్థ ఈ విస్తరణ చర్యలు చేపట్టింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!