

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుని దేశంలోనే తొలిసారిగా నిమిషాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. తొలి దశలో ఈ సేవలను బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తీసుకువచ్చారు. యాప్ ద్వారా మొదటిసారి గ్యాస్ సిలిండర్ ఆర్డర్ చేయడానికి ముందుగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా హెచ్‌పీసీఎల్ తన కొత్త 10 కిలోల హెచ్‌పీ నవ్య కాంపోజిట్ సిలిండర్లు, అలాగే 5 కిలోల మెటల్ సిలిండర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. పారదర్శక డిజైన్ కారణంగా కాంపోజిట్ సిలిండర్‌లో మిగిలిన గ్యాస్ స్థాయిని సులభంగా గుర్తించవచ్చు. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, సిలిండర్ డెలివరీలను హెచ్‌పీసీఎల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్లు, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారానే నిర్వహిస్తారు. మొదటిసారి కేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు తర్వాత ఎక్స్ఛేంజ్ విధానంలో వేగంగా రీఫిల్ పొందే అవకాశం ఉంటుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!