
జనరల్

మహారాష్ట్రలో బ్లింకిట్‌కు చెందిన ఫుడ్ లైసెన్స్‌ను ఆహార, ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్‌డీఏ) రద్దు చేసింది. తనిఖీల్లో భాగంగా రూ.32.71 లక్షల విలువైన కాలం చెల్లిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కరోజులోనే 18,405 కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించినట్లు సమాచారం. విక్రయించకుండా మిగిలిపోయిన నిల్వలను (అన్‌సోల్డ్ ఇన్వెంటరీ) నిర్వహించిన తీరుపై అధికారులు తీవ్రంగా స్పందించారు.
కాలం చెల్లిన సరుకును మళ్లీ మార్కెట్‌లో విక్రయించేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో భివాండి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సంస్థ డైరెక్టర్లు, మేనేజర్లు, స్క్రాప్ విక్రేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!