19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Writer: Shivani K 10:34 AM, 19 అక్టోబర్, 2026
స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు, ప్రధాన సూచీల క్షీణతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మదుపర్లు తమ వాటాలను సులభంగా విక్రయించగలగడం, దేశీయ మార్కెట్లో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల భారత ఈక్విటీ మార్కెట్లలో లాభాల స్వీకరణ తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ పరిస్థితులపై మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారు. అయితే, ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు సుమారు 12 శాతం క్షీణించడం, విదేశీ సంస్థాగత మదుపర్లు భారత ఈక్విటీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ ఏడాది విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల నుంచి 33 బిలియన్ డాలర్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తైవాన్‌, దక్షిణ కొరియాలోని కృత్రిమ మేధ (AI) సంబంధిత కంపెనీల వైపు పెట్టుబడులు మళ్లడం భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోందని వివరించారు.

విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నప్పటికీ, దేశీయ మదుపర్లు మార్కెట్‌కు నిరంతరం అండగా నిలుస్తున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు. కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బుడగ ఏర్పడి అది పేలినా, భారత్‌పై ప్రభావం పరిమితంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో ఏఐ రంగానికి సంబంధించిన పెట్టుబడులు ఇంకా భారీ స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతలో భారత్ వెనుకబడలేదని, సెమీకండక్టర్ల తయారీ రంగంలోనూ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ప్రధాన సూచీలు పడిపోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని వివరించారు. అయితే, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగితే 2027లో భారత మార్కెట్లకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, 2021 మార్చి నుంచి ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలోకి ప్రతి నెలా నికర పెట్టుబడులు వస్తుండటం, క్రమానుగత పెట్టుబడి పథకాల (SIP) ద్వారా దేశీయంగా నిధుల ప్రవాహం కొనసాగడం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌

ఆధునిక హంగులతో సిట్రోయెన్‌ పాత కారు

ఆధునిక హంగులతో సిట్రోయెన్‌ పాత కారు

నవంబర్‌లో పెరగనున్న ఇంధన ధరలు?

నవంబర్‌లో పెరగనున్న ఇంధన ధరలు?

హోండా ద్విచక్ర వాహన విక్రయాలపై భారీ లక్ష్యం

హోండా ద్విచక్ర వాహన విక్రయాలపై భారీ లక్ష్యం

దీపావళి తర్వాత వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం

దీపావళి తర్వాత వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

ట్యాగ్లు
నిర్మలా సీతారామన్భారత స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ పతనంవిదేశీ పెట్టుబడిదారులుదేశీయ మదుపర్లుకృత్రిమ మేధమ్యూచువల్ ఫండ్లుక్రమానుగత పెట్టుబడి పథకాలుసెమీకండక్టర్ల రంగంభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు
జనరల్

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?
జనరల్

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం
సినిమాలు

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
జనరల్

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం
జనరల్

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి
సినిమాలు

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌
బిజినెస్

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ ట్రేడింగ్‌

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టాక్ మార్కెట్‌పై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!