

అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడంతో పాటు ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్య చేపట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ తొలగింపుల ప్రభావం భారత్‌లోని వందలాది మంది ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషించాలని ఒరాకిల్ యాజమాన్యం వివిధ బృందాలను కోరినట్లు తెలుస్తోంది.
కంపెనీ అంతర్గత చర్చల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ తొలగింపులు ఒకే వ్యాపార విభాగానికి పరిమితం కాకుండా సంస్థలోని పలు విభాగాలపై ప్రభావం చూపవచ్చని తెలుస్తోంది. అయితే, ఉద్యోగుల తొలగింపుల సంఖ్యపై ఒరాకిల్ నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!