26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు ధరల సెగతో స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి

Writer: Pooja 09:24 AM, 26 అక్టోబర్, 2026
చమురు ధరల సెగతో స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి

ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వరుస విక్రయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మార్కెట్లో బలమైన రికవరీ కనిపించే వరకు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎంపిక చేసిన షేర్లపైనే దృష్టి పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వారం వెలువడనున్న సెప్టెంబర్ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయం, రిలయన్స్ జియో లిస్టింగ్, ముడి చమురు ధరలు, పశ్చిమాసియా పరిణామాలు మార్కెట్ దిశను ప్రభావితం చేయనున్నాయి. అక్టోబర్ 28న విడుదల కానున్న సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ గణాంకాలు అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య దేశీయ రంగాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడనున్నాయి. వారాంతంలో ద్రవ్యలోటు వివరాలు, బ్యాంకుల రుణాలు–డిపాజిట్ల వృద్ధి, విదేశీ మారక నిల్వల గణాంకాలు కూడా వెలువడనున్నాయి. టీవీఎస్ మోటార్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, సన్‌ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండియన్ ఆయిల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ ఇండియా సహా సుమారు 156 కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి, లాభాల మార్జిన్లు, యాజమాన్యాల భవిష్యత్ అంచనాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే అంచనాలకు తగ్గ ఫలితాల కారణంగా కొన్ని ప్రముఖ బ్యాంకింగ్ షేర్లలో దిద్దుబాటు చోటుచేసుకోవడంతో, రానున్న ఫలితాలు మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయనున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ 28న ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రేట్ల దిశపై ఫెడ్ ప్రకటన, చైర్మన్ వ్యాఖ్యలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా అక్టోబర్ 29, 30 తేదీల్లో తమ విధాన నిర్ణయాలను ప్రకటించనున్నాయి. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడవచ్చనే ఆందోళనలు ముడి చమురు ధరలను పెంచుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీకి 22,300 స్థాయి తక్షణ మద్దతుగా ఉండగా, ఈ స్థాయి కిందకు జారితే 22,000 వరకు మరింత పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పైవైపు 22,850–22,900 శ్రేణి కీలక నిరోధంగా కొనసాగుతోంది. ఈ స్థాయిని అధిగమించలేకపోతే, మార్కెట్ పెరిగినప్పుడు విక్రయించే వ్యూహంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొనుగోళ్లు బలపడి నిఫ్టీ ఈ నిరోధాన్ని దాటితే 23,000–23,150 స్థాయిల వైపు కదిలే అవకాశం ఉంది.

గతవారం నాలుగు ట్రేడింగ్ రోజులు మాత్రమే ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,605 పాయింట్లు, నిఫ్టీ 546 పాయింట్లు పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ పతనం ప్రధాన సూచీలకే పరిమితం కాకుండా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లకూ విస్తరించగా, ఐటీ షేర్లు కొంత నిలకడను ప్రదర్శించాయి. అక్టోబర్ 28న జరగనున్న రిలయన్స్ జియో లిస్టింగ్‌పై మార్కెట్ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ ఐపీఓకు 22.19 రెట్ల సబ్‌స్క్రిప్షన్ లభించడంతో ప్రాథమిక మార్కెట్‌లో భారీగా నిధులు సమీకరించబడ్డాయి. దీంతో సెకండరీ మార్కెట్‌లో లిక్విడిటీపై ఒత్తిడి పెరిగింది. లిస్టింగ్ పూర్తయిన తర్వాత ఐపీఓలో నిలిచిన నిధులు తిరిగి మార్కెట్‌లోకి రావడం, జియో షేర్లకు లభించే స్పందన సూచీలకు ఊరటనిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన కార్పొరేట్ ఫలితాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో అక్టోబర్ 23 నాటికి విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి రూ.48,056 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. 2026లో ఇప్పటివరకు వారి నికర ఉపసంహరణలు రూ.3.08 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. ఇది 2025 పూర్తి సంవత్సరంలో ఉపసంహరించిన రూ.1.66 లక్షల కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. అయితే గతవారం ఎఫ్‌పీఐల విక్రయాల తీవ్రత కొంత తగ్గడంతో మార్కెట్‌కు స్వల్ప ఊరట లభించింది. ఈ వారం ఆ ధోరణి కొనసాగుతుందా, లేక మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందా అన్నది ఇన్వెస్టర్లు గమనించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లెర్నర్స్ లైసెన్స్ నిబంధనలు కఠినతరం చేసే యోచనలో కేంద్రం

లెర్నర్స్ లైసెన్స్ నిబంధనలు కఠినతరం చేసే యోచనలో కేంద్రం

పెద్ద నోట్ల రద్దు తర్వాతా తగ్గని నగదు చలామణి

పెద్ద నోట్ల రద్దు తర్వాతా తగ్గని నగదు చలామణి

స్థిరంగా బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే

స్థిరంగా బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే

ఫ్లిప్‌కార్ట్ పార్శిల్‌లో విక్రయదారుడి నుంచి ఓ వింత లేఖ

ఫ్లిప్‌కార్ట్ పార్శిల్‌లో విక్రయదారుడి నుంచి ఓ వింత లేఖ

వచ్చే వారం ఐదు ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణే లక్ష్యం!
ట్యాగ్లు
దేశీయ స్టాక్ మార్కెట్సెన్సెక్స్ నిఫ్టీరిలయన్స్ జియో లిస్టింగ్ముడి చమురు ధరలువిదేశీ పెట్టుబడిదారులుఅమెరికా ఫెడరల్ రిజర్వ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

వచ్చే వారం ఐదు ఐపీఓలు.. రూ.2,600 కోట్ల సమీకరణే లక్ష్యం!

వీఐ ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..

వీఐ ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో బాల్యవివాహం కలకలం
జనరల్

హైదరాబాద్‌లో బాల్యవివాహం కలకలం

ఆల్మాటీ ఓపెన్‌ టైటిల్‌ యుకి బాంబ్రి జోడీదే..
క్రీడలు

ఆల్మాటీ ఓపెన్‌ టైటిల్‌ యుకి బాంబ్రి జోడీదే..

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు
జనరల్

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు

యలహంక భూమి షర్మిలదే.. విజయమ్మ పాత ప్రకటన మళ్లీ వైరల్‌!
రాజకీయాలు

యలహంక భూమి షర్మిలదే.. విజయమ్మ పాత ప్రకటన మళ్లీ వైరల్‌!

మిరాయ్ 2లో శ్రీలీల కీలక పాత్ర ?
గాసిప్స్

మిరాయ్ 2లో శ్రీలీల కీలక పాత్ర ?

సౌదీలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్రా యాత్రికులు
జనరల్

సౌదీలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్రా యాత్రికులు

కడప జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కడప జిల్లాలో కూటమి హవా..

ఆదర్శ కుటుంబం: త్రివిక్రమ్ మ్యాజిక్ వర్క్ ఔట్ అవుతుందా?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: త్రివిక్రమ్ మ్యాజిక్ వర్క్ ఔట్ అవుతుందా?

సూర్య ముందు అరుదైన రికార్డు?
సినిమాలు

సూర్య ముందు అరుదైన రికార్డు?

టాలీవుడ్ సీనియర్ దర్శకుల కంబ్యాక్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు?
సినిమాలు

టాలీవుడ్ సీనియర్ దర్శకుల కంబ్యాక్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు?

విజయ్ రష్మికపై ద్వేష ప్రచారం..ఎప్పటికి ఆగుతుంది?
సినిమాలు

విజయ్ రష్మికపై ద్వేష ప్రచారం..ఎప్పటికి ఆగుతుంది?

చిరంజీవి ఆచితూచి అడుగులు?
గాసిప్స్

చిరంజీవి ఆచితూచి అడుగులు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!