2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

Writer: Chandrika 09:31 AM, 2 సెప్టెంబర్, 2026
భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

భారత సెక్యూరిటీల్లో, ముఖ్యంగా ఈక్విటీలు, బాండ్లలో అమెరికా పెట్టుబడులు గత పదేళ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగాయి. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2015లో భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 130 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి 390 బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు అధికంగా ఉన్న 30 దేశాల జాబితాలో భారత్‌ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా ఆర్థిక శాఖ, ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌, ఫెడరల్‌ రిజర్వ్‌ సిస్టమ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ ప్రాథమిక గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2025లో అమెరికా పెట్టుబడిదారుల విదేశీ సెక్యూరిటీల పెట్టుబడుల విలువ 19.3 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో 15.3 ట్రిలియన్‌ డాలర్లు ఈక్విటీల్లో, 3.6 ట్రిలియన్‌ డాలర్లు దీర్ఘకాలిక డెట్‌ సెక్యూరిటీల్లో, 0.4 ట్రిలియన్‌ డాలర్లు స్వల్పకాలిక డెట్‌ సెక్యూరిటీల్లో ఉన్నాయి.

2025 చివరి నాటికి భారత ఈక్విటీల్లో అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విలువ 380 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2024లో ఇది 373 బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత దీర్ఘకాలిక డెట్‌ సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడులు కూడా 10 బిలియన్‌ డాలర్ల నుంచి 11 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారులు కలిగి ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్‌ విలువను మాత్రమే సూచిస్తాయి. తయారీ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, ఇతర భౌతిక ఆస్తుల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇందులో లెక్కించలేదు. మరోవైపు చైనాలో అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విలువ 318 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇందులో సుమారు 300 బిలియన్‌ డాలర్లు చైనా ఈక్విటీల్లో, 17 బిలియన్‌ డాలర్లు దీర్ఘకాలిక డెట్‌ సెక్యూరిటీల్లో ఉన్నాయి. దీంతో చైనా కంటే భారత్‌లో అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విలువ అధికంగా నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

పసిడి ధరలకు మళ్లీ బ్రేక్

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

ట్యాగ్లు
అమెరికా పెట్టుబడులుభారత సెక్యూరిటీలుభారత ఈక్విటీలుభారత బాండ్లుఅమెరికా ఆర్థిక శాఖపోర్ట్‌ఫోలియో పెట్టుబడులువిదేశీ పెట్టుబడులుభారత స్టాక్‌ మార్కెట్‌చైనా పెట్టుబడులుగ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్
బిజినెస్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala3 నిమిషాల క్రితం

Great 👍