

సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త కొత్త ట్రెండ్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని కొద్దిరోజులకే కనుమరుగవుతుండగా, మరికొన్ని మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వాటిలో 1980ల ఏఐ ఫొటో ట్రెండ్ ఒకటి. ఈ ట్రెండ్‌లో యువత తమ ఫొటోలను 1980ల కాలం నాటి వింటేజ్ చిత్రాలుగా మార్చుకుంటున్నారు. అప్పటి ప్రత్యేకమైన ఫ్యాషన్, హెయిర్‌స్టైల్స్, రంగురంగుల దుస్తులు, పెద్ద ఆభరణాలు, మృదువైన వెలుతురు, ఫిల్మ్ కెమెరా లుక్‌ను ఏఐ సహాయంతో తమ ఫొటోలకు జోడిస్తున్నారు.
సాధారణ వింటేజ్ ఫిల్టర్లు ఫొటోలోని రంగులు, కాంట్రాస్ట్, లైటింగ్ వంటి అంశాలను మాత్రమే మార్చుతాయి. కానీ ఏఐ వింటేజ్ ట్రెండ్‌లో ముఖాన్ని సాధ్యమైనంత వరకు అలాగే ఉంచుతూ, ఆ కాలానికి సరిపోయే జుట్టు తీరు, దుస్తులు, ఆభరణాలు, నేపథ్యం, వెలుతురు వంటి అంశాలను మార్చుకోవచ్చు. పాత ఫిల్మ్ కెమెరా తరహా గ్రెయిన్, టెక్స్చర్, కలర్ టోన్‌ను కూడా జోడించవచ్చు. అయితే కోరుకున్న ఫలితం రావాలంటే ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్ స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యం.
చాట్‌జీపీటీలో 1980ల వింటేజ్ ఫొటోను రూపొందించాలంటే ముందుగా మొబైల్‌లో చాట్‌జీపీటీని తెరిచి, కొత్త చాట్‌లో మంచి నాణ్యత ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అనంతరం 1980ల కాలం నాటి ఫొటోలాగా మార్చాలని స్పష్టంగా సూచించాలి. అవసరమైతే పాత బాలీవుడ్ స్టూడియో పోర్ట్రెయిట్, ఫ్యామిలీ ఆల్బమ్, కాలేజ్ ఫొటో లేదా వింటేజ్ మ్యాగజైన్ షూట్ వంటి ప్రత్యేక శైలిని కూడా పేర్కొనవచ్చు. మొదటి ఫలితం నచ్చకపోతే జుట్టు తీరు, దుస్తులు, వెలుతురు లేదా ఫిల్మ్ టెక్స్చర్‌లో మార్పులు చేయాలని మళ్లీ సూచించవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!