

ప్రపంచవ్యాప్తంగా పలు యుద్ధాలను ఆపానని, అందుకు నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కాల్సిందని పదేపదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా పులిట్జర్ పురస్కారంపైనా వ్యాఖ్యలు చేశారు. తనకు నోబెల్ బహుమతి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, కనీసం తన రచనలకు పులిట్జర్ అవార్డు వచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. రష్యాకు సంబంధించిన అంశాలపై కథనాలు రాసిన జర్నలిస్టులకు ఈ పురస్కారం దక్కడాన్ని విమర్శిస్తూ, అర్హత లేనివారికి అవార్డులు ఇచ్చారని ఆరోపించారు.
దక్షిణ కరోలినాలో జరిగిన సభలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. గతంలో అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై కథనాలు రాసిన జర్నలిస్టులపై విమర్శలు గుప్పించారు. వారి కథనాలు తప్పుగా ఉన్నాయని, తనను లక్ష్యంగా చేసుకుని రాశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన రచనలకు కూడా పులిట్జర్ పురస్కారం దక్కాల్సిందని అభిప్రాయపడ్డారు. జర్నలిజం, సాహిత్యం, నాటకం, సంగీతం తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పులిట్జర్ పురస్కారాలను అందిస్తారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!