20, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్​లో గాలి పీల్చితే ప్రమాదమే! - దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత

Writer: Satish 07:52 AM, 4 జనవరి, 2026
హైదరాబాద్​లో గాలి పీల్చితే ప్రమాదమే! - దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత

గాలిలో నాణ్యత పడిపోవడంలో హైదరాబాద్‌ నగరం దేశ రాజధాని దిల్లీతో పోటీ పడుతోంది. కొత్త ఏడాది తొలి రోజున పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 వరకు చేరుకుంది. ఇది థర్డ్‌ పార్టీ, గూగుల్‌ యాప్‌లు, పరికరాల ద్వారా నమోదవుతున్న సూచీల ప్రకారం లెక్క. కానీ సీపీసీబీ ఏర్పాటు చేసిన సూచీలలో మాత్రం కొత్త ఏడాది గరిష్ఠంగా 170 వరకే నమోదు కావడం గమనార్హం. సీపీసీబీ సూచించే కొలతల్లో కచ్చితత్వం లేదని కొందరు విశ్రాంత ప్రొఫెసర్లు చెబుతున్నారు. హైదరాబాద్​ నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఏక్యూఐ పరికరాలను ఏర్పాటు చేసింది.

వీటి ద్వారా పీసీబీ గరిష్ఠ, కనిష్ఠ సూచీలను వెల్లడిస్తోంది. ఏక్యూఐ 100 దాటితే ముప్పు పొంచి ఉన్నట్లే అని చెబుతోంది. డిసెంబరులో హైదరాబాద్‌లో గరిష్ఠంగా పీసీబీ లెక్కల ప్రకారం ఏక్యూఐ 132 మాత్రమే ఉంది. థర్డ్‌ పార్టీ యాప్‌లలో నమోదైన ఏక్యూఐ 270 వరకు ఉండటం గమనార్హం. ఇంత వ్యత్యాసం ఉండకూడదని ఒక పక్క శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నాణ్యతను యురోపియన్‌ ప్రమాణాల మేరకు కొలిచే మెషిన్ల ధర ఒక్కొక్కటి దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది. పీసీబీ వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో పని చేయలేవని పరిశోధకులు చెబుతున్నారు.

నిత్యం రోడ్డెక్కుతున్న 50 లక్షల వాహనాలు! :

హైదరాబాద్‌లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజూ సగటున 50 లక్షల వరకు రోడ్డు మీదకు వస్తున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను తీవ్ర ప్రభావితం చేస్తోంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తాచెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను మరింత క్షీణింపచేస్తున్నాయి.

కేపీహెచ్‌బీలో ఏక్యూఐ 302 :

శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ కూకట్​పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని గాలిలో వాయు నాణ్యత సూచీ 302 సూచించింది. ఇది దిల్లీలో ఏక్యూఐ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌)తో సమానంగా ఉంది. కానీ, ఈ ప్రాంతంలో సీపీసీబీ (సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు)కు సంబంధించిన వాయు నాణ్యతను లెక్కించే సూచీలే లేవు. శనివారం సీపీసీబీ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఏక్యూఐ గరిష్ఠంగా 142, రామచంద్రాపురంలో కనిష్ఠంగా 73 నమోదవడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ట్యాగ్లు
హైదరాబాద్ గాలి కాలుష్యంఎయిర్ క్వాలిటీ ఇండెక్స్హైదరాబాద్ AQIవాయు కాలుష్యంఆరోగ్య హెచ్చరికలుకాలుష్య ప్రమాదంPCB నివేదికశ్వాసకోస వ్యాధులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
జనరల్

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు
జనరల్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం
జనరల్

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం
జనరల్

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి
జనరల్

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా
క్రీడలు

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!