9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

Writer: Chandrika 03:01 PM, 9 సెప్టెంబర్, 2026
వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో రెవెన్యూ శాఖలో డబ్బులు ఇవ్వకపోతే పనులు జరగవనే అపవాదు ఉండేదని, ఆ పరిస్థితిని మార్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని, భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

పటిష్టమైన రీసర్వే నిర్వహిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు 36 లక్షల మందికి పాస్‌పుస్తకాలు అందించామని, వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని విధానాలను రూపొందించడమే నిజమైన పాలన అని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం సూపర్‌ సిక్స్‌, పీ4 వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలంతా గౌరవప్రదంగా జీవించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులకు చంద్రబాబు చేతుల మీదుగా పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

ట్యాగ్లు
చంద్రబాబుఆంధ్రప్రదేశ్‌భూ సమస్యలుమీ భూమి మీ హక్కుల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పట్టాదారు పాస్‌పుస్తకాలురెవెన్యూ శాఖభూ రికార్డులుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంరైతులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?