
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించడంతో పాటు, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్ వెబ్కాస్టింగ్ నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, అభ్యర్థుల భద్రతకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత, సీసీటీవీ నిఘా, లైవ్ వెబ్కాస్టింగ్కు సంబంధించిన అంశాలపై తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!