

గుంటూరులో వైకాపా మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి నామినేషన్ సందర్భంగా మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2029లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తుందని, తొలి ఆరు నెలలు తానే హోంమంత్రిగా ఉంటానని పోలీసులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలతో అక్కడున్న నాయకులు, పోలీసులు ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ఆదివారం గుంటూరులోని వైకాపా కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు పార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఆర్వో కార్యాలయానికి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వైకాపా నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశించి అంబటి రాంబాబు స్పందించారు. అక్కడున్న పోలీసులంతా మంచివారేనని, ఒక్కరు మాత్రం మినహాయింపు అంటూ పట్టాభిపురం సీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!