

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో తాను డేటింగ్‌లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటి అమీషా పటేల్ ఘాటుగా స్పందించారు. ముంబయిలో ఇటీవల జరిగిన ఓ వేడుకలో హార్దిక్‌ను అమీషా ఆప్యాయంగా పలకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా ఓ నెటిజన్ వారిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ పోస్ట్ చేయడంతో.. అమీషా నేరుగా స్పందించారు. ఓ పురుషుడు, మహిళ ఆప్యాయంగా పలకరించుకున్నంత మాత్రాన దాన్ని ప్రేమ లేదా డేటింగ్‌గా భావించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
తాను ఆ కార్యక్రమానికి హార్దిక్‌కు తన స్నేహితులను పరిచయం చేయడానికి మాత్రమే వెళ్లానని అమీషా తెలిపారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఊహాగానాలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీంతో హార్దిక్‌తో తనకు ఎలాంటి డేటింగ్ సంబంధం లేదనే విషయాన్ని అమీషా స్పష్టం చేసినట్లయింది. మరోవైపు హార్దిక్ పాండ్యా నటి మహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అమీషా పటేల్ తాజా స్పందన చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!