

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన భార్య అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంటూ భావోద్వేగ సందేశాన్ని రాశారు. పవన్ ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారని, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఆయన సేవలకు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం నిదర్శనమని చెబుతూ ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు ప్రత్యేకంగా మొక్క నాటారు. పవన్ పేరు మీద మారేడు మొక్కను నాటిన ఆయన.. మారేడు దళాలు శివుడికి ఎంతో ఇష్టమని, సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్‌కు ఇదే తన కానుక అని తెలిపారు. తాను మొత్తం 20 మొక్కలు నాటినట్లు వెల్లడించిన నాగబాబు.. పవన్ అభిమానులంతా పుట్టినరోజు సందర్భంగా ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!