21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్!

Writer: Chandrika 11:52 AM, 18 డిసెంబర్, 2025
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్!

సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే, మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

ఈ రోజు ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ కాల్పుల శబ్దాలు వినిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఆ ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, అక్కడ నక్సల్స్ ఏరివేత చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ కదలికలపై ముందస్తు సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా, ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో కొందరు మావోయిస్టులు మృతి చెందగా, మరికొందరు గాయపడి అడవిలోకి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దింపి, మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏరివేత చర్యలు పూర్తయ్యాక పూర్తి వివరాలతో పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొననున్న పరకాల ప్రభాకర్

దేవరగట్టు బన్ని ఉత్సవానికి భారీ భద్రత.. కర్రల సమరంపై అధికారుల నిఘా

రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యంగ్య స్పందన

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

కలెక్టర్లు, ఎస్పీలతోSEC అనిల్ చంద్ర పూణేఠా వీడియో కాన్ఫరెన్స్

ట్యాగ్లు
సుక్మా జిల్లాగొల్లపల్లి అటవీ ప్రాంతండిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్మావోయిస్టులుఎన్‌కౌంటర్కాల్పులుపోలీసులునక్సల్స్భద్రతా బలగాలుసెర్చ్ ఆపరేషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
జనరల్

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొననున్న పరకాల ప్రభాకర్
జనరల్

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొననున్న పరకాల ప్రభాకర్

దేవరగట్టు బన్ని ఉత్సవానికి భారీ భద్రత.. కర్రల సమరంపై అధికారుల నిఘా
జనరల్

దేవరగట్టు బన్ని ఉత్సవానికి భారీ భద్రత.. కర్రల సమరంపై అధికారుల నిఘా

లిటిగేషన్లతో ఎన్నికలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు విమర్శలు
రాజకీయాలు

లిటిగేషన్లతో ఎన్నికలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు విమర్శలు

రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యంగ్య స్పందన
జనరల్

రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యంగ్య స్పందన

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
జనరల్

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ
బిజినెస్

సాధారణ స్థాయి నుంచి అపార సంపద వరకు.. నిఖిల్ కామత్ సక్సెస్ స్టోరీ

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం
రాజకీయాలు

జవహర్‌నగర్ డంప్‌యార్డు తరలించాలి.. ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధం

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

యాంకర్ మాటలకు ఏడాదిగా బాధపడుతున్నా.. హీరో మౌళి భావోద్వేగ వ్యాఖ్యలు

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?
గాసిప్స్

రామ్ చరణ్‌–సుకుమార్‌ RC17లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ?

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?
రాజకీయాలు

బకెట్, పెన్‌స్టాండ్ గుర్తుల కేటాయింపుపై ఏపీ ఎస్ఈసీ ఆంక్షలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!