

అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ మోడల్ అమెరికాలోని జార్జియా రాష్ట్ర ఎన్నికల సమాచారాన్ని అనుమతి లేకుండా యాక్సెస్ చేసినట్లు వెల్లడైంది. సంస్థ అంతర్గత గణాంకాల ప్రాజెక్టులో భాగంగా క్లాడ్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రుసుము చెల్లించి పొందాల్సిన ఎన్నికల డ్యాష్‌బోర్డ్‌లోని సమాచారాన్ని క్లాడ్ పేవాల్‌ను అధిగమించి యాక్సెస్ చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది.
అయితే, క్లాడ్ వ్యక్తిగత ఓటర్ల రికార్డులను పొందలేదని, జార్జియా ఓటరు నమోదు వ్యవస్థలోకి ప్రవేశించలేదని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. మొత్తం ఓట్ల సంఖ్యకు సంబంధించిన సమగ్ర గణాంకాలను మాత్రమే యాక్సెస్ చేసిందని, ఓటింగ్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొంది. ఘటనను గుర్తించిన తర్వాత ఇలాంటి చర్యలను నిరోధించేందుకు భద్రతా చర్యలు తీసుకున్నామని, జార్జియా రాష్ట్ర కార్యదర్శి కార్యాలయానికి, వైట్‌హౌస్‌కు సమాచారం అందించామని తెలిపింది. ఇటీవల ఓపెన్‌ఏఐ ఏజెంట్లు కూడా అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్లలో అనూహ్యంగా ప్రవేశించిన ఘటనలు వెలుగుచూడటంతో ఏఐ భద్రతపై చర్చ మరింత తీవ్రమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!