

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 24, శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇది అక్టోబర్ 25 నాటికి వాయుగుండంగా బలపడి, అక్టోబర్ 27 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వ్యవస్థ కదలిక, తీవ్రతను బట్టి అక్టోబర్ 28న ఉత్తరాంధ్ర–ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశాన్ని వాతావరణ నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే, తుపాను మార్గం, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక హెచ్చరికలను అనుసరిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులపై తాజా సమాచారం కోసం భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసే ప్రకటనలను గమనించాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!