
సినిమాలు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు నేడు సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఏపీ ఎస్ఈసీ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించాలని రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.
నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు అవసరమైన రక్షణ కల్పించాలని, ఈ విషయంలో జిల్లా ఎస్పీలు తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. గడువులోగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేలా ఆర్వోలు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!