

సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంలో బుధవారం రాత్రి జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు భారతీయ పౌరుడు కాగా, మరొకరు సౌదీ అరేబియాకు చెందిన వ్యక్తిగా సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు భారతీయులు గాయపడినట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
సౌదీ అరేబియాలోని చమురు వనరులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, సౌదీ విమానాశ్రయాలపై నెల రోజుల వ్యవధిలో జరిగిన దాడుల్లో మొత్తం 22 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారుల దిగ్బంధనం చమురు రవాణాకు ముప్పుగా మారింది. దమ్మామ్ విమానాశ్రయంలో జరిగిన తాజా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!