
సినిమాలు

బీఏపీఎస్ హిందూ ప్రతినిధుల బృందం పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను కనిపించకుండా ఉండాలని కోరారన్న ఆరోపణల నేపథ్యంలో ఈఫిల్ టవర్ సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఈఫిల్ టవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపారంటూ వచ్చిన ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి.

అయితే ఈ ఘటనపై బీఏపీఎస్ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనను ఆ విధంగా చిత్రీకరించడం సరికాదని పేర్కొంది. గౌరవం, సామరస్యం, ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని బీఏపీఎస్ స్పష్టం చేసింది. ఈ వివాదంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!