
సినిమాలు

ఏపీలో రక్షణ రంగ తయారీకి సంబంధించిన పరిశ్రమల అభివృద్దికి కీలక ముందడుగు పడుతోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి రక్షణ రంగానికి సంబంధించిన వ్యవస్థను (defence ecosystem) నిర్మించడానికి శ్రీసత్యసాయి జిల్లాలో 914 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనివల్ల మన యువతకు హై-టెక్ డిఫెన్స్ తయారీ రంగాలు, 800 నాణ్యమైన ఉద్యోగాలు లభించడంతో పాటు రాయలసీమలో సరఫరాదారుల వ్యవస్థ (supplier base) కూడా పెరుగుతుంది. మనం చెప్పాము, చేసి చూపించాం’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!