11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

Writer: Pooja 03:14 PM, 11 సెప్టెంబర్, 2026
ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం రూ.620 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వెలుపల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ జల్‌ జీవన్‌ మిషన్‌ కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో 31 మార్చి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.

ఈ ఏడాది జూన్‌ 18న కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో పెండింగ్‌ చెల్లింపులను త్వరగా క్లియర్‌ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారని శ్రీనివాస్‌ తెలిపారు. అధికారుల నిరంతర కృషితో బిల్లుల చెల్లింపులు జరిగాయని చెప్పారు. అలాగే, నవంబర్‌ 2024 నుంచి 31 మార్చి 2026 వరకు రెట్రోఫిట్టింగ్‌ పనులకు సంబంధించిన రూ.647 కోట్ల బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందన్నారు. స్పర్శ పథకం కింద సుమారు రూ.138 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటివరకు సుమారు రూ.70 కోట్లు చెల్లించారని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులతో ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఆర్థిక ఉపశమనం లభించిందని అసోసియేషన్‌ పేర్కొంది. ఇకపై నెలనెలా నిర్దిష్ట విధానంలో చెల్లింపులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లుపెండింగ్ బిల్లులుజల్ జీవన్ మిషన్పవన్ కళ్యాణ్చంద్రబాబు నాయుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా
జనరల్

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన
జనరల్

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!