
సినిమాలు

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఎంఘిలాబ్ స్క్వేర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్లుగా చిత్రీకరించిన ఓ హోర్డింగ్ ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. హోర్డింగ్‌పై ఇంగ్లిష్, పర్షియన్ భాషల్లో ట్రంప్‌ను అంతం చేస్తామంటూ హెచ్చరిక సందేశాలు రాయడం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రదర్శన అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
హోర్డింగ్‌పై మినాబ్‌కు చెందిన చిన్నారుల స్మృతికి అంకితం చేసినట్లు కూడా పేర్కొన్నారు. గతంలో ఇరాన్‌పై జరిగిన దాడిలో మినాబ్ ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ ఈ నిరసన సందేశాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఈ హోర్డింగ్ స్థానికంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!