
గాసిప్స్
ఉత్తరప్రదేశ్లో తీవ్ర చర్చకు దారితీసిన బ్లూ డ్రమ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై సౌరభ్ కుటుంబం స్పందించింది. ఈ కేసులో ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలకు న్యాయస్థానం మరణశిక్ష విధించడంపై కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులకు విధించిన శిక్షపై తమకు సంతృప్తిగా ఉందని వెల్లడించారు.
ఇదే సమయంలో సౌరభ్ ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై కూడా కుటుంబం కీలక నిర్ణయం ప్రకటించింది. సౌరభ్ పెద్ద కుమార్తెను దత్తత తీసుకుంటామని తెలిపింది. చిన్న కుమార్తె విషయంలో మాత్రం ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమని, ముందుగా డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే చిన్నారి విషయంలో తదుపరి చర్యలు నిర్ణయించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!