
రాజకీయాలు

తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జీల పేర్లను ప్రకటించారు. ఆరు జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా పార్టీ బాధ్యతలను అప్పగిస్తూ జాబితాను విడుదల చేశారు.
ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. నియమితులైన ఇన్‌చార్జీలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!