

ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యురాలు హెలెన్ హేన్స్‌పై కారు దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. మెల్‌బోర్న్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాన్‌గరట్టాలో ఆమె కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 65 ఏళ్ల హెలెన్ తీవ్రంగా గాయపడినట్లు విక్టోరియా తాత్కాలిక పోలీసు చీఫ్ ఆష్లే మాసన్ వెల్లడించారు. ఘటనకు సంబంధించి 43 ఏళ్ల కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఒక కత్తిని కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ దాడిగా అభివర్ణించారు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ప్రధాని ఆల్బనీస్ పేర్కొన్నారు. హెలెన్ హేన్స్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, నిందితుడు ఈ చర్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో రాజకీయ నాయకులకు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న బృందాలను గుర్తించి, బాధ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!