20, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టోల్ చార్జీ లపై కొత్త రూల్స్ రిలీజ్ చేసిన కేంద్రం

Writer: Venkatesh 02:12 PM, 21 జనవరి, 2026
టోల్ చార్జీ లపై కొత్త రూల్స్ రిలీజ్ చేసిన కేంద్రం

జాతీయ రహదారుల పై టోల్ చెల్లించకుండా ప్రయాణించే వాహనదారుల పై ఇకపై కఠిన చర్యలు అమల్లోకి రానున్నాయి. టోల్ ఎగవేతను అరికట్టడం, టోల్ వసూళ్లలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలతో టోల్ చెల్లింపు వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.

కొత్త రూల్స్ ప్రకారం టోల్ బకాయిలు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), ఫిట్‌నెస్ సర్టిఫికేట్, నేషనల్ పర్మిట్ వంటి కీలక సేవలు అందుబాటులో ఉండవు. ఈ మేరకు ఇప్పటివరకు అమల్లో ఉన్న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్–1989 ను సవరించి, కొత్త రూల్స్–2026 ను కేంద్రం జారీ చేసింది.

జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సాంకేతికత ఆధారంగా టోల్ వసూళ్లను అమలు చేయడంలో ఈ నిబంధనలు ఉపయోగపడనున్నాయి. ఇకపై ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహన యాజమాన్యాన్ని మార్చాలంటే, ముందుగా టోల్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ఫీజులు పెండింగ్‌లో ఉంటే వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను కూడా రీన్యూ చేయరు.

అలాగే, ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థ ద్వారా వాహనం టోల్ ప్లాజాను దాటినా, ఫీజు వసూలు కాకపోతే ఆ వాహనదారుడిని టోల్ చెల్లించని వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ వివరాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఫారం–28 లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు.

టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా ప్రయాణించేలా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థను కూడా కేంద్రం దశలవారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం కొన్ని హైవేల పై పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న ఈ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. జులై 2025 లో విడుదల చేసిన ముసాయిదా పై ప్రజల అభిప్రాయాలు సేకరించిన అనంతరం, తాజాగా తుది నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ట్యాగ్లు
టోల్ చార్జీలుజాతీయ రహదారులుకేంద్ర ప్రభుత్వ నిబంధనలుటోల్ ఎగవేతవాహన సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
జనరల్

సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట
క్రీడలు

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 43: సీక్రెట్ రూమ్‌లో షాలినీ...హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ షాక్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు
జనరల్

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సిద్ధమైన స్టార్ ప్లేయర్లు

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం
జనరల్

టెక్సాస్‌ బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగువారి కోలాహలం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సొంతూరులో దసరా వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం
జనరల్

ఆహార భద్రతకు తెలంగాణ సర్కారు సన్నద్ధం

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి
జనరల్

ప్రభుత్వ బలగాలే లక్ష్యంగా యెమెన్‌లో హౌతీల భీకర దాడి

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్‌, కావ్య మారన్‌ పెళ్లి సందడి?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా
క్రీడలు

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!