6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

Writer: Sreekanth Reddy 12:35 PM, 6 సెప్టెంబర్, 2026
హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

దేశంలోని న్యాయవ్యవస్థలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను (సీజే) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. కొలీజియం సిఫార్సు చేసిన కొద్ది రోజులకే కేంద్రం వేగంగా స్పందించి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.

నియామకాల వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అదేవిధంగా బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ రవీంద్ర వి. ఘుగే కలకత్తా హైకోర్టుకు నేతృత్వం వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్‌ను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి బాంబే హైకోర్టు కొత్త సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ నియామకాల నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా అసాధారణ రీతిలో తీవ్ర ఆరోపణలు చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు అక్కడ పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్‌ను నియమించారు.

మిగతా నియామకాలలో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రాను అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఒడిశా హైకోర్టుకు చెందిన జస్టిస్ కృష్ణ రామ్ మహాపాత్ర ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అల్పేష్ యశ్వంత్ కోగ్జే మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటిని జమ్మూ & కాశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలతో పలు హైకోర్టులలో న్యాయపాలన మరింత పటిష్ఠం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

ట్యాగ్లు
హైకోర్టుచీఫ్ జస్టిస్కేంద్రంసుప్రీంకోర్టుకొలిజీయంఅర్జున్ రామ్ మేఘావాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు
షోస్

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు
షోస్

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం
జనరల్

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు
జనరల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి
జనరల్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?
షోస్

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...
షోస్

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ
షోస్

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!