
రాజకీయాలు

సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయనకు లేఖ రాసిన సంస్థ, ఆయన త్యాగం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొంది. అదే సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరింది.
వాంగ్‌చుక్ దీక్ష ముగిసినా ఉద్యమం ఆగిపోదని సీజేపీ స్పష్టం చేసింది. ఉద్యమ లక్ష్యాలు నెరవేరే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. వాంగ్‌చుక్ చేసిన త్యాగానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!