
రాజకీయాలు

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన బాలకృష్ణ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!