

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రకృతిని, పూలను ఆరాధించే గొప్ప సంప్రదాయానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో మహిళలంతా సంతోషంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, కుటుంబాలన్నీ సిరిసంపదలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తరతరాలకు అందించడంలో బతుకమ్మ కీలక పాత్ర పోషిస్తుందని, మహిళల ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!