6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Writer: Harika S 10:11 PM, 6 సెప్టెంబర్, 2026
నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు హత్యకు గురైన ఘటనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. నేరానికి దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలోని భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలను విచారణలో పరిశీలించాలని స్పష్టం చేశారు.

కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సాక్ష్యాలను వీలైనంత త్వరగా సేకరించి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నేరానికి పాల్పడిన వ్యక్తికి చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ చేపట్టాలని ఆదేశించారు.

బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని సీఎం సూచించారు. న్యాయశాఖ, పోలీసుశాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి విచారణలో జాప్యం లేకుండా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేశారు.

ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణనర్సు హత్యతుక్కుగూడహైదరాబాద్ క్రైమ్మేజిస్టీరియల్ విచారణఫాస్ట్‌ట్రాక్ కోర్టుతెలంగాణ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
జనరల్

ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
జనరల్

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ
జనరల్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్
జనరల్

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
జనరల్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!