

హైదరాబాద్‌లో నేడు దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమన్వయ సదస్సు జరగనుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించనున్న ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణతో పాటు అంతర్రాష్ట్ర ముఠాల కట్టడికి వివిధ రాష్ట్రాల పోలీసులు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం, మావోయిస్టుల ఏరివేత అనంతరం భద్రతా పరిస్థితులపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరికి చెందిన డీజీపీలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అలాగే ఐబీ, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశంలో కీలక అంశాలుగా ఉండనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!