5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

Writer: Pooja 12:12 PM, 5 సెప్టెంబర్, 2026
కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో 1,000 రోజుల ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో జరిగిన మహా ధర్నా సన్నాహక సమావేశంలో మంత్రులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని, తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దాదాపు 1,000 రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎలా కొనసాగుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పదేళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆదివారం జరిగే మహా ధర్నాకు కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చేలా డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు సమన్వయం చేయాలని మంత్రులు ఆదేశించారు.

NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌తో పాటు ఇతర కాంగ్రెస్ అనుబంధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రులు సూచించారు. మహా ధర్నా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సమావేశమై ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గ ఇంచార్జిలు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్లతో సమన్వయం చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్కేసీఆర్ రాజీనామామహా ధర్నాపొన్నం ప్రభాకర్శ్రీధర్ బాబుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!