

అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం కల్పించే హక్కును పరిమితం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై మేరీలాండ్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా ఎల్. బోర్డ్‌మాన్ బుధవారం ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వలస కుటుంబాలు, ఇతర సంఘాలు దాఖలు చేసిన కేసు పరిష్కారమయ్యే వరకు ఈ ఉత్తర్వు అమల్లో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పౌరసత్వం కోసం ప్రసవ సమయంలో అమెరికాకు వచ్చే ‘బర్త్ టూరిజం’ను అడ్డుకోవాల్సిందేనని ట్రంప్ గతంలో ప్రకటించారు.
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ చేసిన తొలి ప్రయత్నాన్ని జూన్‌లో అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం ఆగస్టులో కొన్ని మార్పులతో మరోసారి కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వును నిలిపివేయవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జడ్జి బోర్డ్‌మాన్ తోసిపుచ్చారు. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ పరిణామంపై వైట్‌హౌస్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!