
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా కొద్ది రోజులకే ఆ పదవి నుంచి వైదొలుగుతున్నారు. అక్టోబర్ 13న ఆమె నిర్వహించిన తొలి మీడియా సమావేశం సుమారు 14 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా ముగ్గురు విలేకరుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు. ఆమె ప్రదర్శనపై విమర్శలు రావడంతో పాటు, కీలక బాధ్యతలను నిర్వహించే సామర్థ్యంపై చర్చ మొదలైంది.
మీడియా నుంచి ఎదురైన విమర్శల నేపథ్యంలో ట్రంప్ ఆమె పదవిలో కొనసాగడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగం వల్ల అనవసరమైన ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని, మరోసారి ఆలోచించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. దీంతో కేటీ జకారియా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!